మనిషి కొద్ది రోజులు ఆహారం లేకున్నా జీవించవొచ్చు కానీ మంచినీరు లేకుండా జీవించడం చాలా కష్టం. బ్రంహ్మంగారు చెప్పినట్లు భవిష్యత్ లో నీటి కటకట ఉంటుందని..డబ్బులిచ్చి గుక్కెడు నీరు కొనాల్సిన దైనీయమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది, వాటర్ బాటిల్, టిన్స్ కొనాల్సిన పరిస్థితి దాపురించింది.  ప్రస్తుతం చెన్నై నగరంలో నీటి కష్టాలు మామూలుగా లేవు.  గుక్కెడు మంచి నీటికోసం యుద్దం చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఉంది.

ఉన్నవారి సంగతి పక్కన బెడితే పేదలకు నీటి కష్టాలు దారుణంగా దాపురించాయి. నీటి కొరత కారణంగా కార్యాలయాలు, హోటళ్లు మూతపడుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. రిజర్వాయర్లు ఎండిపోవడం, బోర్లు అడుగంటడంతో చెన్నై వాసులు గుక్కెడు నీళ్ల కోసం అలమటించిపోతున్నారు.  ఇక  చెన్నైలో నీటికి కటకట ఏర్పడిందని డిఎంకె ఎంపి దయానిధి మారన్‌ అన్నారు. లోక్‌సభలో మారన్‌ మాట్లాడుతూ చెన్నైకి నీటిని సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లలో నీరు 1 శాతానికి పడిపోయిందని ఆయన చెప్పారు.

తాము నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన అన్నారు. తాజాగా చెన్నై వాసులు నీటి కష్టాలు కొంత వరకైనా తీర్చాలన్న సదుద్దేశంతో సినీ నటుడు మంచు మనోజ్ కూడా తనవంతు సాయంగా ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నారు.మనోజ్ పంపిస్తున్న ట్యాంకర్ల వద్ద జనాల రద్దీ చూస్తే తాగునీటి ప్రాధాన్యత ప్రస్తుతం చెన్నై సిటీని ఎంత వేధిస్తుందో తెలుస్తోంది.  తాజాగా ఈ విషయంపై స్పందిచిన మంచు మనోజ్ మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో తాగునీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నానని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: