ఆర్య,కేథరీన్ జంటగా రాఘవ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం "గజేంద్రుడు". ఉదయ్ హర్ష ఈ చిత్రాన్ని తెలుగులొ విడుదల చేశారు‌. భారతీ ,వరప్రసాద్ వడ్డెల సమర్పకులు. ప్రశాంత్ గౌడ్, సంజు ఈ చిత్రాన్ని నైజాం లో విడుదల చేశారు. సైలెంట్ గా   గత వారం విడుదలై మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో
 ఏర్పాటు చేసారు.


ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. సినిమాను నైజాం లో విడుదల చేశాం.. ఇదొక సైలెంట్ హిట్. నిర్మాత నమ్మకమే ఈ చిత్ర ప్రధాన విజయం. రోజురోజుకు థియేటర్స్ పెంచుకుంటూ మంచి విజయాన్ని అందుకుంది. 300 దియేటర్స్ లో అద్భుతంగా ఆడుతొంది.‌ మంచి కాన్సెప్ట్ తొ విజువల్ వండర్ గా గజేంద్రుడు రూపొందింది. వచ్చె వారం మరిన్ని ధియేటర్స్ ఈ సినిమాకు ఇస్తామన్నారు.


ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ... ఆర్య గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు.హిట్ చెసినందుకు ప్రేక్షకులకు ధ్యాంక్స్ తెలిపారు. ‌


ఆర్య మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సినిమా పాటలకొసం హైదరాబాద్ వచ్చాం.. అడవిలో చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమా మేకింగ్ చేశాం.. మా హార్డ్ వర్క్ కు తగ్గ ఫలితం వచ్చింది. తెలుగు తమిళ ప్రేక్షకులు అపూర్వమైన విజయాన్ని అందించారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: