మొన్నటి వరకు ఏపి రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తన ఫామ్ హౌజ్ లో కాస్త సేద తీరారు. మొదటి నుంచి తనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని..తన ఫామ్ హౌజ్ లో రక రకాల చెట్లు, పవువులు, పక్షులను పెంచుతున్నారు.  అంతే కాదు అక్కడికి వెళ్తే స్వయంగా ఆయన వీటి సంరక్షణ చూస్తుంటారు.   

ఈ సందర్భంగా ఆయన ఫామ్ హౌజ్ లో  ఓ ఆవు దూడకు జన్మనివ్వడంతో పవన్ ఆనందం అంతాఇంతా కాదు. అప్పుడే పుట్టిన ఆవుదూడను ఆయన ముద్దు చేస్తూ..దాని తో సంతోషంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  ఇక మూవీస్ విషయానికి వస్తే..త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ ఏపిలో జరిగిన లోక్ సభ, రాజ్యసభ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. 

జనసేన పార్టీ తరుపు నుంచి నిలిపిన అభ్యర్థుల్లో ఒకే ఒక్కరు గెలిచారు.  ట్విస్ట్ ఏంటేంటే జనసేన అధ్యక్షుడి హోదాలో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండూ దారుణమై ఫలితాలు పొందారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: