విభిన్నమైన కథలు.. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన కెరీర్ లో ముందుకు సాగిపోతున్న హీరో రానా దగ్గుబాటి. ఈ విషయం తను నటించిన మొదటి సినిమా లీడర్ నుండి కృష్ణం వందే జగద్గురుం, ఘాజీ, బాహుబలి..ఇలా వరుస సినిమాలు చూస్తేనే తెలిసిపోతుంది. ఇక హీరోయిన్ ఫిదా పిల్ల సాయి పల్లవి కూడా అంతే.. పాత్రల ఎంపికలో ఎంతో శ్రద్ధ చూపిస్తుంది. తను నటించే సినిమాలలో పాత్ర గనక నచ్చకపోతే నిర్మొహమాటంగా ఆ సినిమాకి నో చెప్పేస్తుంది. అలాంటి ఈ ఇద్దరు ఒక సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తుండడం ఒక గొప్ప విషయం. ఇక ఈ ఇద్దరు జోడీ కట్టిన సినిమానే 'విరాటపర్వం'.  

90 ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. అంతలోనే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని లేటెస్ట్ న్యూస్.  తెలంగాణాలోని ధరిపల్లి గ్రామంలో ఈ మొదటి షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. ఇప్పటికే ఈ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఇలా లీక్ అయిన ఫోటోల్లో లో లంగా ఓణీలో ఉన్న సాయి పల్లవి సైకిల్ తొక్కుతూ ఉంది.  రెండు జడలతో న్యాచురల్ లుక్ లో కనిపిస్తోంది. ఈ ఫొటో విరాటపర్వం సినిమాలోనిదేనని సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలకపాత్రలో నటిస్తోంది. 'నీది నాది ఒకే కథ' ఫేం వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై డి. సురేష్ బాబు.. సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: