కబాలి, కాలా లాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్ తన తర్వాతి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నాడనేది ఇంతవరకు తెలిసి రాలేదు. అయితే  గత కొంత కాలంగా చిక్కుల్లో ఉన్న పా రంజిత్ ఇప్పుడు వాటి నుండి బయటకు వచ్చినట్టున్నాడు. సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేసిన దర్శకుడితో పని చేయాలని ఎవరికైనా ఉంటుంది. కాలా , కబాలి చిత్ర ఫలితాలెలా ఉన్నా పా రంజిత్ కి మాత్రం అవకాశాలు తగ్గట్లేదు.

 

అయితే తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ లో  నటుడిగా ఒక ప్రత్యేక క్రేజ్ ఉన్న  నటుడు రానా దగ్గుబాటి. ఆయన ఎంచుకునే కథలు చాలా విభిన్నంగా ఉంటాయి. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న రానా వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపున బాలీవుడ్‌లో మెచ్చదగిన పాత్రలు చేస్తూ -రానా బిజీ షెడ్యూల్ కొనసాగిస్తున్నాడు. అయితే  రానా , పా రంజిత్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని సమాచారం.

 

కెరీర్ ఆరంభంనుంచీ తమిళ చిత్రాలకు ప్రాథాన్యత ఇస్తోన్న రానా, ఆర్యతో కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్నాడన్న వార్తలు వినిపించటం తెలిసిందే. కోలీవుడ్‌లోనే మరో మల్టీస్టారర్‌కీ రానా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఆ సినిమాను పా రంజిత్ తెరకెక్కిస్తాడట.సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసి.. ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో రంజిత్ క్రేజ్ పెంచుకున్నాడు. ఓ మల్టీస్టారర్ కథను సిద్ధం చేశాడని, ఆ ప్రాజెక్టులోని ఓ హీరోగా రానాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.

 

మరో హీరో ఎవరనేది త్వరలో తెలియనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందట. ఇప్పటికే తెలుగు హిందీలో బిజీగా ఉన్న రానా ఈ సినిమాతో కొలీవుడ్ లో కూడా బిజీగా మారిపోతాడు. హిందీలో హాథి మేరె సాథి అనే పీరియాడికల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పా రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్నాడనేది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: