తమిళ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యినప్పడినుంచి వివాదాల్లోనే ఉంది. దానికి కారణం ప్రధానం గా ఇద్దరు వ్యక్తులు....నటి వనిత మరియు మీరా మిథున్. వీళ్లిద్దరు ఇప్పటికే వేరు వేరు కేసుల్లో ఇరుక్కున్నారు.  మీరా మిథున్ పై మనీ లాండరింగ్ కేసు ఉండగా, తాజాగా వనిత పై కిడ్నాపింగ్ కేసు బరాయించారు.


తమిళ బిగ్ బాస్ 3 లో పాల్గొంటున్న నటి వనితని తెలంగాణ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయడం జరగనున్నది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ కంటే తమిళ బిగ్ బాస్ ముందుగా మొదలు అవుతుండటంతో వనిత బిగ్ బాస్ 3 హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. దాంతో చెన్నై పోలిసుల సహకారంతో ఆమెని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. నటి వనిత తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.


నటుడు విజయ్ కుమార్, నటి మంజుల కుమార్తె ఈ వనిత. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న వనిత గత పదేళ్లుగా ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంది. తల్లితో అలాగే తండ్రి తో భర్తతో, రెండో భర్తతో ఇలా చెప్పుకుంటే పొతే పెద్ద లిస్ట్ ఉంది. తాజాగా తన భర్తతో విడిపోయింది అయితే కూతురుని చూసుకుంటానంటూ తీసుకెళ్లి దాచిపెట్టడంతో వనిత మాజీ భర్త తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో తెలంగాణ పోలీసులు చెన్నై వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: