‘నిను వీడని నీడను నేనే’.. అంటే ఏదో అనుకున్నాం కాని.. పేరు తగ్గట్టుగానే ప్రేక్షకుడు ఎక్కడికి వెళ్లినా వీడటం లేదు సందీప్ కిషన్. ఆఖరుకి టాయిలెట్‌లను కూడా వీడటం లేదు. ప్రశాంతంగా పోసుకుందాం అని టాయిలెట్‌కి వెళ్లిన వాళ్లకు ‘కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త..!

 

నిను వీడని నీడను నీనే.. జూలై 12న వచ్చేస్తున్నా’ అంటూ బోర్డ్ పట్టుకుని టాయిలెట్‌కి వెళ్లే వాళ్లను భయపెడుతున్నాడు సందీప్ కిషన్. హీరోగా సందీప్ కిషన్.. నటిస్తూ నిర్మిస్తున్న ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం జూలై 12న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన తిప్పలే ఈ టాయిలెట్ ప్రమోషన్స్. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వినూత్నంగా ‘నిను వీడని నీడను నేనే’ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు.

 

హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్స్‌లోని టాయిలెట్స్‌లో ‘నిను వీడని నీడను నేనే’ బోర్డ్‌లను ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ కోసం వెళ్లిన వాళ్ళు ఈ బోర్డ్‌లు చూసి ఈ రకంగా కూడా ప్రచారం చేయొచ్చా అని నవ్వుకుంటున్నారు.

 

టాయిలెట్ కోసం వెళ్లిన వాళ్లకు.. ‘కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త..! నిను వీడని నీడను నీనే..’ అంటూ బోర్డ్‌తో పాటు.. ‘నాకు హారర్ ఫిల్మ్స్ అంటే భయం.. ఫాస్ట్‌గా జిప్ మూసెయ్.. నిను వీడని నీడను నీనే’, ‘అద్ధంలో చూసుకున్నప్పుడు జాగ్రత్త.. దెయ్యాలు ఉంటాయి’ లాంటి కొటేషన్స్ ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: