సినిమాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయలేం. సినిమా వారి జీవితాలు కూడా ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. అపుడే సినిమాలు మానేసాం అంటారు. మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే సినిమాల్లో కనిపిస్తారు. సినిమాలో ట్విస్ట్ లాగే వారు కూడా అభిమానులకు ట్విస్ట్ ఇస్తుంటారు. శృతి హాసన్ కూడా ఇలాగే షాకిచ్చింది.గత ఏడాది ఒక్క సినిమాలోనూ నటించకుండా, ప్రేమాయణంలో మునిగితేలింది శృతిహాసన్.

 

అలా కెరీర్‌ని పక్కన పెట్టేయడంతో -దర్శక నిర్మాతలు ఆమెను అప్రోచ్ కావడం మానేశారు.బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్‌తో బ్రేక్‌అప్ చెప్పాక కొన్నిరోజులు ఎక్కడా కనిపించని శృతి, తమిళంలో ఓ టీవీ షో చేసి షాకిచ్చింది. ఇక టీవీ షోలపై దృష్టి పెడుతుందేమో అనుకునే టైంలో -సినిమాలపై దృష్టి పెట్టినట్టు సంకేతాలు పంపింది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు ఓకె చెప్పిన శృతి, తాజాగా రవితేజ సరసన హీరోయిన్‌గా చేస్తోంది.

 

ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయిన శృతి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఫాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘మీ పెళ్లెప్పుడు?.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? మీ పెళ్లి ఎపుడో చెపితే మేము వస్తాం’ అంటూ చిలిపిగా అడిగాడు. దానికి సమాధానంగా శృతి ‘ఇప్పట్లో పెళ్లిచేసుకునే ఆలోచనే లేదు. దానికి ఇంకా టైముంది. వెయిట్ చేయాలి.

 

అయితే నా బర్త్‌డే పార్టీకి మీరంతా రండి’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచింది.శృతిహాసన్ త్వరలోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది. లేటెస్టుగా శృతి స్పందించడపై ఆమె పెళ్లి విషయంపై అందరికీ క్లారిటీ వచ్చినట్టే!  పెళ్ళికి టైం ఉందని చెప్పి సినిమాల్లో బిజీ అయిపోవాలని చూస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: