సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు బోలెడు సెంటిమెంట్లు ఉంటాయి. ఈ సెంటిమెంట్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొందరు హీరోలకు మొదటి రోజు షూటింగ్ కు రాకపోవడం సెంటిమెంట్ ఐతే మరి కొందరికి మాత్రం మూడు అక్షరాల పేరుతో సినిమా పేరు పెట్టటం సెంటిమెంట్. కొందరు కావాలని ఈ సెంటిమెంట్లు ఫాలో ఐతే కొందరికి మాత్రం కాకతాళీయంగా జీవితంలో జరుగుతాయి. ఇలా భూమిక జీవితంలో తన సినిమాలకు సంబంధించి 7 నంబర్ సెంటిమెంట్ ఒకటి ఉంది. 
 
ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న జూనియర్ ఎన్టీయార్, పవన్ కల్యాణ్ మహేశ్ బాబులతో భూమిక మొదటిసారిగా సింహాద్రి, ఖుషి, ఒక్కడు సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు అప్పటికి ఆ హీరోల కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ఈ మూడు సినిమాలు మహేశ్, పవన్, ఎన్టీయార్లకు హీరోలుగా వారి కెరీర్లొ 7వ సినిమా కావడం ఈ మూడు సినిమాల్లో భూమికనే హీరోయిన్గా నటించటం విశేషం. 
 
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హిట్లిచ్చిన భూమిక ప్రస్తుతం అక్క , వదిన తరహా పాత్రల్లో నటిస్తుంది. భూమిక నిర్మాతగా మధ్యలో ఒక సినిమా తీసినా ఆ సినిమా ఫ్లాప్ అవ్వటంతో మరలా సినిమా నిర్మాణం జోలికి పోలేదు.ఇలా ముగ్గురు హీరోలకు ఒకే హీరోయిన్ హిట్లు ఇవ్వటం మాత్రం అరుదైన విషయమే.ఇలా ముగ్గురు హీరోలకు ఒకే నంబర్ సినిమాల్లో హీరోయిన్గా నటించి హిట్లు ఇచ్చిన ఘనత మాత్రం భూమికకు మాత్రమే సొంతం. 



మరింత సమాచారం తెలుసుకోండి: