ఆమె ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో భార్య.. ఆమె భర్త దాదాపు 25 ఏళ్లుగా బాలీవుడ్ ను ఏలుతున్నాడు. అయినా ఆమె మాత్రం చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తోంది. అంతే కాదు.. సూపర్ స్టార్ భార్యను కదా.. నాకేం తక్కువ అని కాకుండా తనదైన రంగంలో రాణిస్తోంది.


ఆమే హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరి.. సాధారణ ప్రజల్లానే నేనూ సామాన్య జీవితాన్ని గడుపుతున్నా అంటోంది షారుక్‌ సతీమణి గౌరీ ఖాన్‌. ఇంతకీ ఆమె ఏం చేస్తోందో చెప్పలేదు కదూ.. ఆమె ఇంటీరియర్‌ డిజైనర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. భర్త సంపాదనపైనే ఆధారపడకుండా తనకంటూ గుర్తింపుకోసం తపించిన గౌరీ ఆ రంగంలో రాణిస్తోంది.


తన కేరీర్ గురించి చెబుతూ.. నేను గౌరీ ఖాన్‌ డిజైన్స్‌ని మొదలు పెట్టినప్పుడు షారుక్‌ నాకు చాలా సహాయం చేశారు. ఆయన మా కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారు.. అంటూ వివరించింది గౌరీ. అంతే కాదు.. షారుక్‌ వల్ల నా చుట్టూ పరిసరాలు పాజిటివిటీతో నిండిపోయాయి. ఇక్కడ నెగిటీవ్‌ కూడా ఉండొచ్చు. కానీ నేను పాజిటివిటీని మాత్రమే తీసుకుని, నెగిటీవ్‌ని పక్కకు నెట్టేస్తాను.. అంటూ తన సీక్రెట్ చెప్పింది


ఓ స్టార్‌ భార్యనైనా తాను చాలా సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నానని గౌరీ చెబుతోంది. మిగిలిన అందరిలాగానే నేనూ వర్కింగ్‌ వుమెన్‌ని. నా వృత్తిపరమైన అవసరాల కోసం మాత్రమే మీడియా ముందుకు వస్తానంటోంది గౌరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: