హంస నందిని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఐటెం సాంగ్స్ కు మంచి ప్రసిద్ధి. హాట్ హాట్ అందాలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేయగలదు. అయితే ఈ మధ్యకాలంలో హంసా నందినికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తుండడంతో హంసా లాంటి స్పెషల్ బ్యూటీలకు అవకాశాలు ఆవిరైపోయాయి. అలాగని తనలోని సెగలు పుట్టించే అందాలను దాచుకోవడం కరెక్ట్ కాదు కదా! అని భావించిన హంసా నందిని.. సోషల్ మీడియా ద్వారా సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది. 


సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది ఈ హంస. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు పెట్టింది హంసా నందిని. ఈ పిక్స్ లో హంసా అందాలు చూసి రెప్పవాల్చలేక పోతోంది కుర్రకారు. 


ఎద అందాలను ఎలివేట్ చేస్తూ ఓ సెక్సీ పోజిచ్చిన హంసా నందిని.. దానిపై 'నేను దేని గురించి ఆలోచిస్తున్నానో గెస్ చేయండి.. కాప్షన్ ఇవ్వండి' అంటూ నెటిజన్లకు పని చెప్పింది. దీంతో ఆమె అందాల గురించి ఆలోచిస్తూ పదే పదే ఆ ఫోటోనే చూస్తూ రకరకాల కాప్షన్స్ వెతికే పనిలో పడ్డారు యువకులు. 'బిగ్ మూవీ డీల్ ఆఫర్ వచ్చిందేమో!, వావ్, ఫైరింగ్ బ్యూటీ' అంటూ కామెంట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: