లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే మనకు ఇంతకుముందు అనుష్క, నయనతార గుర్తుకు వచ్చేవారు. అనుష్క కెరీర్లో అరుంధతి, భాగమతిలాంటి సూపర్ హిట్లు ఉన్నాయి. కానీ అనుష్క సైజ్ జీరో సినిమా తరువాత సినిమాలు చేయటం తగ్గించింది. నయనతార కూడా తమిళ సినిమాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత తెలుగులో ఇవ్వటం లేదు. కేవలం తమిళంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ప్రత్యామ్నాయంగా సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటుంది. 
 
నిన్న సమంత నటించిన ఓ బేబీ సినిమా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉందని, సమంత ఆ పాత్రలో నటించలేదని జీవించిందని ప్రశంసలు వచ్చాయి. 30 ఏళ్ళ వయసు దాటినప్పటికీ, పెళ్ళైనప్పటికీ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూనే పోతుంది సమంత. ప్రస్తుతం తెలుగులో వరుస హిట్లు అందుకుంటున్న హీరోయిన్ సమంత మాత్రమే. 
 
 
వరుసగా యూ టర్న్, ఓ బేబీలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్టవ్వటంతో దర్శకులు కొత్త కథలతో సమంతను సంప్రదిస్తున్నారట. నయనతార గతంలో నటించిన ఒక తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయటానికి ప్రయత్నాలైతే జరుగుతున్నాయట. కథ నచ్చితే పారితోషికం విషయంలో సమంత పెద్దగా ఇబ్బందులు పెట్టదని తెలుస్తుంది. మిగతా ఏ హీరోయిన్లకు దక్కని అదృష్టం తెలుగులో ప్రస్తుతం సమంతకు మాత్రమే దక్కింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: