అన్నపూర్ణ స్టూడియోస్ బ్యేనర్ పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న సినిమా మన్మధుడు 2. నాగార్జున కెరీర్లో మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాకు సీక్వెల్గా మన్మధుడు 2 సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఆగస్ట్ 9న విడుదల చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడట. కానీ ఈ డేట్ అంత మంచిది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి ఆగస్ట్ 15న ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదల కాబోతుంది. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంత భారీ క్రేజ్ ఉన్న సినిమాకు వారం ముందు మన్మధుడు 2 విడుదల చేస్తే నాగార్జున నష్టపోయే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
దీనికి కారణం ఏమిటంటే ఆగస్ట్ 9న మన్మధుడు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వారం రోజుల్లోనే మన్మధుడు2 థియేటర్లు సాహో సినిమా కోసం కేటాయించక తప్పదు. సాహో సినిమా క్రేజ్ తో పోలిస్తే మన్మధుడు2 క్రేజ్ తక్కువ. మన్మధుడు 2 సాహో రెండూ హిట్టైనా సాహో సినిమా ప్రభావం మన్మధుడు 2 కలెక్షన్లపై గట్టిగా పడే అవకాశం ఉంది. మరి నాగార్జున మన్మధుడు 2 రిలీజ్ డేట్ మారుస్తాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: