ఇప్పుడు ప్రతిదీ ట్రెండే. ఆన్ లైన్ మీడియాను వాడుకొని బలే బురిడీలు కొట్టిస్తున్నారు. ఇప్పటి టెక్నాలజీ ప్రపంచంలో దర్శక నిర్మాతల కన్నా ఫ్యాన్స్ యమా దూకుడుగా ఉన్నారు. దానికి నిదర్శనమే పైన పోస్టర్. ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని అచ్చం అదే గెటప్ కి మ్యాచ్ అయ్యే ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్ తీసుకుని తలపాగా పెట్టేసి ఇది నిజమేమో అనిపించేలా పోస్టర్ సృష్టించారు ఓ ఫ్యాన్ గ్రూప్.

 

ఇప్పుడిది వైరల్ అవుతోంది. జై లవకుశలోని రావణ పాత్ర తాలూకు పిక్ ని వాడుకున్న సదరు టీమ్ ఆర్ ఆర్ ఆర్ కు సెట్ అయ్యేలా పర్ఫెక్ట్ గా సింక్ చేయడం గమనార్హం. ఈ ట్రెండ్స్ మీద అవగాహన లేని అభిమానులు ఇదే నిజమనుకుంటున్నారు. కానీ ఏది ఏమైనా పోస్టర్ మాత్రం అదరగొట్టారు అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ తాలూకు ప్రమోషన్ మొదలు కావడానికి ఇంకా చాలా టైం ఉంది.

 

వచ్చే ఏడాది జులై 30 రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఎంతలేదన్నా వచ్చే సంక్రాంతి తరువాత కానీ పబ్లిసిటీ స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. అంత వరకు ఆగలేక అభిమానులు ఇలా షాకులు ఇస్తున్నారు.రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా తారక్ కు జోడి ఎవరో ఇంకా తేలనే లేదు.

 

యంగ్ టైగర్ ఫాన్స్ సస్పెన్సు భరించలేకపోతున్నారు. రాజమౌళి అమెరికా ట్రిప్ కోసం వారం రోజులు బ్రేక్ తీసుకున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆయన వచ్చాక అహ్మదాబాద్ వెళ్లే డేట్ ని ప్రకటించనుంది. ఈ లాంగ్ షెడ్యూల్ అయ్యాకే కొత్త అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: