బాలీవుడ్ బాద్ షా గారాల కూతురు సుహానా ఖాన్ త్వరలో వెండి తెరపై కనిపించి మురిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మరోవైపు బాలీవుడ్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? ఆమెను ఎప్పుడు వెండితెర మీద చూద్దామా? అని సుహానా ఫ్యాన్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై షారుక్ ఫ్యామిలీ పెద్దగా స్పందించలేదు. ఇదిలా ఉంటే షారుక్ సొంత ప్రొడక్షన్ లో నిర్మించనున్న ఒక చిన్న సినిమా ద్వారా సుహానా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది అని రూమర్స్ వచ్చాయి..ఈ విషయంపై  సుహానా బెస్ట్ ఫ్రెండ్  హీరోయిన్  అనన్యా పాండే క్లారిటీ ఇచ్చింది. 


ఇటీవల లండన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న సుహానా ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ ఫిలిం స్కూల్‌లో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. కాగా,  సుహానా బాల్య స్నేహితురాలు అనన్య పాండే ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేశారు. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2 సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా ‘జూమ్‌’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


తన బెస్టీ సుహానా ఖాన్‌ ఎప్పుడు సినిమాలోకి రాబోతుందో తెలిపారు. చదువులో భాగంగా న్యూయార్క్‌లో  ఫిలిం స్కూల్‌కు వెళ్లబోతున్న సుహనా తన చదువు పూర్తికాగానే సినిమాల్లోకి వచ్చే అవకాశముందని ఆమె స్నేహితురాలు అంటుంది.  యాక్టింగ్ లో చిన్నప్పటి నుంచే ఆమెకు కొంచెం అవగాహనా ఉంది. ఆమె మొదటి సినిమాలో అద్భుతంగా నటించగలదనే నమ్మకం తనకుందని అనన్య తెలిపింది. సుహానా ఎంతో టాలెంటెడ్‌ అని అంతకుముందు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పొగడ్తల వర్షం కురిపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: