ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సృష్టించిన రికార్డ్స్ తో స్ఫూర్తి పొంది 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథని భారీ స్థాయిలో లాంఛ్‌ చేసారు. అయితే చిరంజీవి సినిమాకి వంద కోట్ల వరకు గ్యారెంటీగా మార్కెట్‌ వుంటుంది కానీ రెండు వందల కోట్లకి పైగా పెట్టుబడి రాబట్టాలంటే అన్నీ చోట్లా సక్సస్ ను కొట్టక తప్పదు. బాహుబలి తర్వాత తెలుగు సినిమాలకి ఇతర భాషల్లో పెరిగిన ఆదరణ నేపథ్యంలో చిత్ర బృందం ఈ రిస్క్‌ చేసారన్న సంగతి అందరికీ తెలిసిందే.
 
అయితే బాహుబలి మాదిరిగా ఇతర భాషల వారి దృష్టిని ఆకర్షించడంలో సైరా ఇంతవరకు సక్సెస్‌ కాలేదు. రిలీజ్‌ చేసిన టీజర్‌లో కూడా ప్రత్యేకతలు కాకుండా రాజమౌళి షాట్స్‌ కనిపించడంతో మెగా అభిమానులు కూడా దీనిపై భారీగా నమ్మకాలు పెట్టుకోవడం లేదు. అక్టోబర్‌ 2న విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సైరాపై భారీగా అంచనాలను పెంచడం ఎలా అనే దానిపై నిర్మాత చరణ్‌ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.  

భారీ సినిమాలకి ప్రీరిలీజ్‌ బజ్‌ ఎంతగా వుంటే అంతగా బెనిఫిట్‌ అవుతుంది. హైప్‌ వల్ల ఓపెనింగ్స్‌ బాగా రావడమే కాకుండా సినిమాకి టాక్‌ కూడా బాగా వచ్చినట్టయితే వసూళ్ల ఉధృతికి అది తోడ్పడుతుంది. ఇంత స్కేల్‌లో తీసిన సినిమాలకి ప్రమోషన్లలోనే సగం సక్సస్ వుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే సైరాకు అదే పెద్ద లోటుగా కనిపిస్తోంది. సాంగ్ టీజర్స్, థియోట్రికల్ ట్రైలర్స్ ఆకర్షించలేక సరయిన అంచనాలు ఏర్పడకపోతే 2.0 మాదిరిగా భారీ ఫ్లాప్ ను చూడవలసి వస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: