పాపం అక్కినేని హీరో పరిస్థితేంటో తనకే అర్థం కావడం లేదని జుట్టు పీక్కుంటున్నాడట. ఎందుకంటే గీతాఆర్ట్స్ నిర్మించే అఖిల్ సినిమా వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుండిపోయింది. హడావుడిగా పూజ అయితే చేసారు గానీ, ఆ తర్వాత అక్కడి నుంచి సినిమా అంగుళం ముందుకు జరగలేదు. ఈ విషయంలో హీరో అఖిల్ తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. వేరే విషయాల్లో కూడా అఖిల్ గీతా సంస్థ తీరుపై అసంతృప్తితో వున్నట్లు రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు హీరోయిన్ ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. పోనీ హీరోయిన్ అంటే దొరకాలి. కొత్త అమ్మాయి లేదా కాస్త నోటెడ్ ఫేస్. డేట్ లు ఇలా చాలా వ్యవహారాలు వుంటాయి. పైగా రెమ్యూనిరేషన్ కాస్త ఎక్కువ అయితే గీతా సంస్థ అంత సులువుగా ఓకె చేయదు. ఇలా బోలెడు లెక్కలు వుంటాయి. ఇది సహజం కూడా.
కానీ సినిమాటోగ్రాఫర్ ను కూడా ఇప్పటి వరకు ఈ సినిమాకు ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ ను ఎందుకు ఫిక్స్ చేయలేదో అన్న రీజన్ కరెక్ట్‌గా తెలియడం లేదు. అయితే రెండు మూడు పేర్లు పరిశీలనలో వున్నాయని, దర్శకుడు భాస్కర్ కు, నిర్మాత బన్నీ వాస్ కు ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరాల్సి వుందని సమాచారం.

గీతాసంస్థ సాయిధరమ్ తేజ్ తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు మారుతి ఈ విషయంలో స్పీడ్ గా వున్నారు. కానీ అఖిల్ తో సినిమా మాత్రం ఓపెనింగ్ తో ఆగింది. తేజు సినిమా పూర్తయితే తప్ప అఖిల్ సినిమా పట్టాలు ఎక్కదు అన్న గాసిప్ లు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తుంటే ఈ ఏడాదిలో అఖిల్ సినిమా విడుదల వుండదేమో? అన్నసందేహాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: