టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిబిజీగా ఉన్నాడు. ‘సాహో’ తర్వాత ‘జాన్’ సినిమా లైన్‌లో ఉందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ కోసం మరో సినిమా రెడీ అయ్యిందని లేటేస్ట్‌గా టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కోసం కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ డైరెక్టర్ కథ సిద్ధం చేశారట. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ డైరెక్టర్ యు.వి.క్రియేషన్స్ సంస్థకు కథ వినిపించాడట. ఆ కథ విన్న నిర్మాతాలు మేం రెడీ అంటూ ఆ  డైరెక్టర్  ను లాక్ చేశారట.

ఇక మిగిలింది ప్రభాస్ మాత్రమేనని.. ఆయనకు కూడా త్వరలోనే కథ వినిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్‌కు సరిగ్గా సరిపోయే కథను రాసుకొని మరీ వెళ్లాడట ఆ డైరెక్టర్. అయితే మొదట ఈ కథ కేజీఎఫ్ హీరో యశ్ దగ్గరికి వెళ్ళిందని సమాచారం. ఏం జరిగిందో ఏమోగానీ ఆహీరోను వద్దనుకుని ప్రభాస్ అయితే న్యాయం చేస్తాడని భావించిన ఆ డైరెక్టర్ హైదరాబాద్‌కు వచ్చి వాలిపోయాడట.

మొత్తానికి కన్నడ టాప్ డైరెక్టర్ కన్ను ప్రభాస్ పై పడింది. యువీ క్రియేషన్స్ కూడా కథ విని లాక్ చేసేసింది. అయితే ప్రభాస్ ఈ కథ ఎప్పుడు వింటారో..? డార్లింగ్‌‌కి కథ నచ్చుతుందో..? నచ్చదో..? కథ విన్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో..? ఇంతకీ ఆ టాప్ డైరెక్టర్ ఎవరో..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి. అయితే ఆ డైరెక్టర్ ఎవరన్న ఆతృత ప్రభాస్ ఫ్యాన్స్‌లో బాగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: