దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. టాలీవుడ్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ క్రేజియస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్‌గా అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గిరిజన ఉద్యమ నాయకుడు కొమరం భీంగా.... రామ్‌చ‌రణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే వచ్చేసింది.


ఫ‌స్ట్ లుక్ అంటే రాజ‌మౌళి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కాదండోయ్‌... ఫ్యాన్‌మేడ్ ఫ‌స్ట్ లుక్‌. టెక్నాలజీ మాయ‌లో దర్శక నిర్మాతల కన్నా హీరోల అభిమానులు ఇప్పుడు స్పీడ్ గా ఉన్నారు. టాలీవుడ్ హీరోల సినిమాల ఫస్ట్ లుక్స్‌, ట్రైలర్ల కన్నా ఫ్యాన్ మేడ్ టీజ‌ర్లు... ట్రైలర్లు ముందు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్‌లో కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా ఎన్టీఆర్‌కు తల‌పాగా పెట్టిన ఓ పోస్టర్ క్రియేట్ చేసి గ్రూపులో వదిలారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పడ‌ది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.


జై లవకుశలోని రావణ పాత్ర తాలూకు పిక్ ని వాడుకున్న సదరు టీమ్ ఆర్ ఆర్ ఆర్ కు సెట్ అయ్యేలా పర్ఫెక్ట్ గా సింక్ చేయడం గమనార్హం. ప‌రీక్ష‌గా చూడ‌ని వాళ్ల‌కు అయితే ఇది నిజంగా రాజ‌మౌళి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌లాగానే క‌నిపిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ‌దిలిన ఈ లుక్‌తో రాజ‌మౌళి టీంకే నిజంగా షాక్ ఇచ్చారా ? అన్న‌ట్టుగా ఉంది. ఈ లుక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: