టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాను కోలీవుడ్లో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా  అక్కడ బాగానే ఆడింది. రాశిఖ‌న్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. విశాల్ ఎన్టీఆర్ నటనతో తాను పోటీ పడలేన‌ని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగులో రిలీజ్ చేయమని ప్రకటించారు. కోలీవుడ్లో హిట్ అయింది అన్నఓవ‌ర్ కాన్పిడెన్స్‌ ఏమో గాని ఇప్పుడు సడన్ గా ఈ నెల 12న అయోధ్య పేరుతోనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.


క్లైమాక్స్‌లో పది నిమిషాలు మినహా మిగిలిన అంత టెంపర్ ను మ‌క్కీకి దించేసిన అయోగ్య‌ ఇప్పుడు తిరిగి తెలుగులో రిలీజ్ చేయడం ఎందుకు అన్న‌ది ఎవరికి అర్థం కావడం లేదు.పైగా డబ్బింగ్ చేయము అని చెప్పిన విశాల్ మరి హక్కులు ఎలా అమ్మనిచ్చాడో తనకే తెలియాలి. అసలే 12న విపరీతమైన పోటీ ఉంది. దొరసాని- నిను వీడని నీడను నేనే - రాజ్ దూత్ లతో పాటు హృతిక్ రోషన్ సూపర్ 30 అదే రోజు ఒకేసారి దాడి చేయబోతున్నాయి. మొన్న వచ్చిన ఓ బేబీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది... కాబట్టి స్క్రీన్లు ఎక్కువ శాతం కొనసాగే అవకాశం ఉంది. 


ఇలాంటి పరిస్థితుల్లో అయోగ్యను తీసుకురావడం అంటే సాహసమే. ఎన్టీఆర్ హీరోగా హిట్ అయిన సినిమాలను మనోళ్ళు ఇప్పటికే బుల్లితెర మీద కూడా చాలాసార్లు చూసేసి ఉన్నారు. ఇప్పుడు అలాంటి హిట్ సినిమాలో విశాల్ నటిస్తే మనోళ్ళు ఖర్చుపెట్టుకుని థియేటర్ కి వెళ్లి మరి సినిమా చూస్తారా? అన్న విషయం ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న వాళ్ళకి తెలియాలి. మరి దొరసాని రాజ్ దూత్‌తో పోటీపడి అయోగ్య‌ ఏమాత్రం వసూళ్లు రాబ‌డుతుందో ?  లేదా తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేసిన వాళ్ల‌కు షాక్ ఇస్తుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: