జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయిన టెంపర్ సినిమా ని తమిళంలో అయోగ్య టైటిల్ పేరిట రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర లో హీరో విశాల్ నటించాడు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కి వరుస ఫ్లాపుల్లో ఉన్న క్రమంలో టెంపర్ సినిమా తో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే తాజాగా ఈ సినిమాని కోలీవుడ్ ఇండస్ట్రీలో కి రీమేక్ చేసిన హీరో విశాల్ తెలుగులో కూడా మరొకసారి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.


దీంతో ఈ వార్త విన్న చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వారు ఇది మరీ టూమచ్ అంటే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినట్టు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ యాక్టర్ చేసిన ఆ కథలో మరో హీరోను ఊహించుకోవడం అంటేనే కుదరని పని.


అలాంటిది తెలుగులోనే మళ్ళీ దాన్ని డబ్ చేయడ అంటే.. టైమ్ వెస్ట్ చేయడమే...తమిళ్ లో ఆ సినిమా బాగానే ఆడింది కదా అని మళ్ళీ తెలుగులో కూడా సక్సెస్ అవుతుంది అని రిలీజ్ చేయడం నిజంగా ఒక ప్రయోగమనే చెప్పాలి. మరి ఈ ప్రయోగంతో విశాల్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: