రంగస్థల కళాకారుడుగా తన కెరియర్ మొదలుపెట్టి సినిమా నటుడుగా గత నాలుగు దశాబ్దాలుగా 750 సినిమాలలో నటించిన కోట శ్రీనివాసరావుకు ఒక విచిత్రమైన మనోవ్యధ బయలుదేరిందట. ఈవిషయాన్ని స్వయంగా కోట తన 76వ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

తాను గత 38 సంవత్సరాలుగా రోజుకు 20 గంటలు పనిచేస్తూ ప్రతిరోజు ఉదయమే లేచిపోయి 8 గంటలకు షూటింగ్ కు రెడీ అయ్యే అలవాటు ఉండటంతో ఇప్పుడు ఎటువంటి పని లేకుండా ఖాళీగా ఉండటం తనకు నరకంగా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనితో తనకు డబ్బు అవసరం లేకపోయినా ‘నాయనా ఒక వేషం ఇవ్వరా ఇంట్లో కూర్చుని పిచ్చెత్తి పోతోంది’ అంటూ అవకాశాల కోసం కొందరు దర్శకులకు ఫోన్స్ చేస్తున్న ఆశ్చర్యకర విషయాన్ని బయట పెట్టాడు. 

వాస్తవానికి తనకు ఇప్పటికీ నటించే శక్తి ఉన్నా తనకు దర్శకులు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో తనకు తెలియదు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ప్రస్తుతం తన ఆరోగ్యం అంతా ఉందని కొంచెం మోకాళ్ళ నొప్పులు తప్ప తనకు ఎటువంటి అనారోగ్యం లేకపోయినా తనకు వయసు అయిపోయింది అంటూ చాలామంది తనను ఎందుకు పక్కకు పెడుతున్నారో అర్ధం కావడం లేదు అంటూ కోట తన పై తానే జోక్ చేసుకున్నాడు

ఇదే సందర్భంలో కోట మాట్లాడుతూ తాను అవకాశాల కోసం అడుగుతున్నాను అని భావించ వద్దని సినిమా షూటింగ్ లో దాదాపు 150 మంది మధ్య ఎప్పుడు బిజీగా ఉంటూ కాలం గడిపిన తనకు ఇప్పుడు చేయడానికి పనిలేక ఖాళీగా ఉండటంతో తాను ఇలా అడుగుతున్న విషయాన్ని దర్శకులు అర్ధం చేసుకోవాలి అంటూ కామెంట్స్ చేసాడు. తనకు వయసు పెరగడం వల్ల ఒక షూటింగ్ లో కాస్త మెట్లు ఎక్కలేను అని చెప్పినంత మాత్రాన తనకు అవకాశాలే తగ్గిపోతాయని తాను అనుకోలేదు అంటూ కోట చేసిన కామెంట్స్ ను బట్టి ఆయన గుండెలలోని బాధ అర్ధం అవుతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: