ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరుగాంచిన సమంత, ఏది పట్టినా బంగారమే అవుతోంది. తొలిసారి ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, ఆ సినిమా సూపర్ హిట్ తో తన తొలి సినిమా హీరో నాగచైతన్యను తన ప్రేమ మాయలో పడేసి ఇటీవల అక్కినేని వారి ఇంటి కోడలయింది. ఇక మొదటినుండి సమంత చేసిన సినిమాలు చూసుకుంటే వాటిలో ఎక్కువగా సక్సెస్ ఫుల్ సినిమాలే కనపడతాయి. అందుకే ఆమెతో ఎలాగైనా ఒక సినిమా చేసి మంచి హిట్ కొట్టాలని దర్శకులు, నిర్మాతలు ఎదురుచూస్తుంటారు. 

ప్రతి సినిమాతో తన క్రేజ్ మరియు ఫ్యాన్స్ ను మరింత పెంచుకుంటూపోతున్న సమంత, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓబేబీ సినిమాతో మరొక్కసారి ప్రేక్షకుల మనసుని గెలిచింది. సినిమా ఎంతో అద్భుతంగా ఉండడమే కాక, సినిమాలో మెయిన్ రోల్ లో నటించి, మొత్తం సినిమానే తన భుజస్కంధాల పై వేసుకుని ఆమె నటించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే ఆమెకు కొంత సమస్యగా మారిందని అంటున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు. సమంతకు వస్తున్న వరుస విజయాలు చూసి కొందరు హీరోయిన్లు లోలోపల ఎంతో అసూయపడుతున్నారని, తాము కూడా ఎంతో కష్టపడి తమకు వచ్చిన అవకాశాలు వినియోగించుకున్నప్పటికీ, సమంత రేంజిలో సక్సెస్ మరియు క్రేజ్ పొందలేకపోతున్నాం అని ఈర్ష్య పడుతున్నారట. అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి మన చేతుల్లో ఉండవు కనుక మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, 

ఎంతైనా సమంత ఎంతో కష్టపడి పైకి వచ్చారని, అయితే మిగతావారికంటే ఆమె చేసిన సినిమాలు ఎక్కువ శాతం విజయాలను అందుకోవడం ఆమె అదృష్టమని, అది మనకు దక్కలేదని మన చుట్టూ ఉండే కొందరు లోలోపల అసూయపడడం సహజం. ఇక సినిమా ఇండస్ట్రీలో అందరితో ఎంతో సరదాగా ఒదిగివుండే సమంత, ఇటువంటివన్నీ పెద్దగా పట్టించుకోకపోవచ్చని కొందరు సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: