సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గల్లా అశోక్ డెబ్యూ మూవీ కోసం దిల్ రాజు లాంటి నిర్మాత నేరుగా రంగంలోకి దిగారు. అయితే రాజు మధ్యలోనే ఈ ప్రాజెక్టును వదులుకున్నారు. దీనికి ప్రధాన కారణం అశోక్ హీరోగా ఏమంత ప్రామిసింగ్‌గా కనిపించకపోవడమే కారణం అన్న గుస‌గుస‌లు ఇండస్ట్రీలో అప్పట్లో వినిపించాయి.


ఆ తర్వాత అశోక్‌ను ఎవరి చేతుల్లో పెడదామా అని ఆయన తండ్రి గల్లా జయదేవ్ ఆలోచన చేశారు ఒక టైం లో సురేష్ బాబుతో కూడా అప్రోచ్ అయినా ఆయన కూడా అశోక్ తో సినిమా అంత సేఫ్ గేమ్ కాదన్న నిర్ణయానికి వచ్చారు. చివరకు ఓ డైరెక్టర్ పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. భలే మంచి రోజు - దేవదాస్ సినిమాలు అందించిన శ్రీరామ్ ఆదిత్య చేతిలో అశోక్ డెబ్యూ మూవీ పెట్టార‌ట‌.


ఇక ఈ సినిమాకు గ‌ల్లా జ‌య‌దేవ్ & ఫ్యామిలీయే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. గల్లా అశోక్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడా మాంచి థ్రిల్లర్ స్టోరీని తయారుచేసే పనిలో బిజీగా వున్నట్లు తెలుస్తోంది. ఓ మోస్త‌రు బ‌డ్జెట్‌తోనే ఈ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రి శ్రీరామ్ ఆదిత్య అశోక్‌ను టాలీవుడ్‌లో ప్రామీసింగ్ హీరోగా నిల‌బెడ‌తాడో ?  లేదో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: