ఇటీవల హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ధనవంతుల పిల్లలతో పాటు... ఇండస్ట్రీకి చెందిన మహామహుల వారసులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఒళ్లు తెలియ‌కుండా ఫుల్ గా తాగేసి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న వీరు పోలీసులకు దొరికితే... తాగిన మైకంలో చేసే రచ్చ అంత ఇంత కాదు. మమ్మల్ని మీరు అడ్డుకుంటారా ? మేము ఎవరో తెలుసా అంటూ నానా హడావుడి చేయడం ఈ సెలబ్రిటీల పిల్లలకు మామూలైపోయింది.


హైదరాబాదులోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెలబ్రిటీల పిల్లలు పట్టు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లో తాజాగా నిర్వహించిన తనిఖీల్లో టాలీవుడ్‌కు చెందిన అగ్రనిర్మాత కొడుకు అడ్డంగా దొరికిపోయాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ -10లో డైమండ్ హౌస్ వద్ద ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో చిక్కిన ఆ నిర్మాత కొడుకు తనను వదిలి వేయాలని పోలీసుల ముందు నానా హంగామా చేశాడు.


ఆల్కహాల్ టెస్టులో అతడు మోతాదుకు మించి మందు సేవించినట్టు చేరడంతో పాటు పోలీసులపై రుబాబు చేయడంతో అతడి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత‌కు ఆ నిర్మాత జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 25లో నివసిస్తాడంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడమే గాక.. ఓ రాజకీయ నాయకుడి చేత ఫోన్లు చేయించి నానా రచ్చ చేసినా పోలీసులు మాత్రం లొంగ‌కుండా కేసు న‌మోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: