బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా నటుడు నానా పటేకర్‌పై ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో ఆయన తనను వేధించారని తనుశ్రీ ఓషివారా పోలీసుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేని కారణంగా అతనికి న్యాయస్థానం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

 

ఈ నేపథ్యంలో తనుశ్రీ తరఫు న్యాయవాదులు అంధేరీ రైల్వే మొబైల్‌ కోర్టును సంప్రదించారు. ఆమె లీగల్‌ టీం మొత్తం హాజరైంది. కానీ ఓషివారా పోలీసు స్టేషన్‌ నుంచి ఒక్క అధికారి కూడా కోర్టు రూమ్‌కి రాలేదు. ఈ మేరకు ప్రొటెస్ట్‌ పిటీషన్ వేయడానికి కోర్టు తనుశ్రీకి సమయం ఇచ్చింది. ఈ కేసును సెప్టెంబరు 7వ తేదీకి వాయిదా వేసింది. తనుశ్రీ గత ఏడాది అక్టోబరులో నానా పటేకర్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు.

 

2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా సెట్‌లో ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె దర్శకుడు రాకేష్‌ సారంగ్‌, కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య, నిర్మాత సమీ సిద్ధిఖీల పేర్లను కూడా పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడున్న వారిని పోలీసులు విచారించారు. అయితే వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదు.

 

కానీ, ఈ విషయంలో తను పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతోంది. ఈ విషయమై ఆమెకు పలు మహిళా సంఘాలు సపోర్ట్ చేసినా, బాలీవుడ్ నుండి మాత్రం... తీవ్ర వ్యతిరేకత ఎదురైతుందని బాలీవుడ్ బడా సినీ పండితుల ఏకాభిప్రాయం. ఎలాంటి బెదిరింపులు ఎదురైనా ఉద్యమాన్ని ఆపేదిలేదని ఆమె ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: