ఈ నెల 21న తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 3 షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షో కి మూడవ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారని అందరికీ తెలిసినదే. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనేసరికి హోస్ట్ గా నాగార్జున అద్భుతంగా చేయడంతో తాజాగా జరగబోయే సీజన్ కి నాగార్జున ని ఎంపిక చేశారు షో నిర్వాహకులు.


దీంతో నాగార్జున ఈ షో తో మరొకసారి టెలివిజన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు. ఇందులో భాగంగా ఇటీవల విడుదలైన షో ప్రోమో లో చాలా డిఫరెంట్ గా అలరించారు. ఇదిలావుండగా తాజాగా ఈ షో ప్రారంభం కాకముందే ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 3లోకి ప్రభాస్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున.


ప్రభాస్ నటించిన సాహో మూవీ ఆగస్ట్ 15న విడుదల కానుండటంతో ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు కూడా చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడట నాగార్జున. ప్రభాస్ తో పాటు శ్రద్దా కపూర్ కూడా బిగ్ బాస్ లోకి రానునందని సమాచారం. మరి నాగార్జున ఆఫర్ కి ప్రభాస్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: