సాయిపల్లవి.. తెలుగులో అభినయానికి ప్రాధాన్యం ఇచ్చే ఓ అరుదైన హైబ్రిడ్ పిల్ల.. ఫిదాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ పిల్ల.. ఆ తర్వాత అనేక చిత్రాలతో తన ప్రతిభ నిరూపించుకుంది. కేవలం నటిగానే కాకుండా వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.


వృత్తి రీత్యా డాక్టర్ అయిన సాయిపల్లవి.. ఇప్పటికీ తాను డాక్టర్ నే అని గర్వంగా చెప్పుకుంటుంది. సినిమాల జోరు తగ్గాక తప్పకుండా ప్రాక్టీస్ చేస్తానని చెబుతోంది. తన సినిమాలు ఆడని నిర్మాతలకు తీసుకున్న పారితోషకం కూడా వెనక్కి ఇచ్చేంత పెద్ద మనసున్న హీరోయిన్.


అయితే సాయి పల్లవికి ఓ చెల్లెలు కూడా ఉంది. విచిత్రం ఏంటంటే.. ఆమె కూడా అచ్చు సాయిపల్లవిలాగానే ఉంది. ఇటీవల తాను తన ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అచ్చు అక్కలాగానే ఉన్న చెల్లిని చూసి అంతా షాకవుతున్నారు.


మరి సాయిపల్లవి లాగా ఆమె చెల్లెలు కూడా సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందో లేదో తెలియదు.. గతంలోనూ తెలుగు తెరపై పలువురు అక్కాచెల్లెళ్లు హీరోయిన్లుగా రాణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: