జనాలని ఎక్కువగా ప్రభావితం చేసే మాధ్యమం సినిమా. సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఉంటుంది. దీనికి చాలా సంఘటనలు ఉదాహరణలుగా ఉన్నాయి. ఆ మధ్య భర్తను చంపి ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేద్దామనుకున్న సంఘటన ఇటువంటిదే. అయితే తాజాగా ఇద్దరు దొంగలు సినిమాలో లాగా దొంగతనం చేయాలి అనుకుని చివరకు పోలీసులకు పట్టు బడ్డారు. వివరాల్లోకి వెళితే,

 

హాలీవుడ్‌ సినిమా ‘బేబీ డ్రైవర్‌’ లో లాగా ముగ్గురు వ్యక్తులు ఓ బ్యాంకు దోపిడీకి ప్లాన్‌ వేశారు. కృష్ణానగర్‌ ప్రాంతంలోని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి గాల్లోకి కాల్పులు జరిపి దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. మామూలుగా సినిమాల్లో అయితే బ్యాంకు సెక్యూరిటీ గార్డులు ప్రతిఘటించరు. కానీ ఇక్కడ బ్యాంకు సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై నిందితులను ప్రతిఘటించాడు...వారి దోపిడీ ప్లాన్‌ కాస్త రివర్స్‌ అయింది. ఈ ఘటనంతా బ్యాంకు బయట, లోపల ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది.

 

బ్యాంకు నుంచి 2 కిలో మీటర్ల మేర సీసీ కెమెరాల్లో నిందితులకు సంబంధిత దృశ్యాలు కూడా నమోదయ్యాయి. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులు ప్రభ్‌జ్యోత్‌ సింగ్‌ (25), సుఖ్‌ దేవ్‌ సింగ్‌ (19)లను అరెస్ట్‌ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయిన మరో నిందితుడి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాం.

 

వస్త్రవ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన ప్రభ్‌జ్యోత్‌ సింగ్‌.. సులభంగా డబ్బులి సంపాదించడం కోసం ఈ దోపిడీకి ప్లాన్‌ చేశారని విచారణలో తేలిందని సౌత్‌వెస్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మేఘనా యాదవ్‌ తెలిపారు. అయితే తప్పించుకున్న ఒక నిందితుడిని తొందరలోనే పట్టుకుంటామని,మరల్ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా వారికి అవగాహన కల్పిస్తామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: