నందమూరి తారక రామారావు క్లాసిక్ మూవీ ‘దానవీర శూరకర్ణ’ రీమేక్ లో నటించాలని జూనియర్ ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో ఉన్న కల. ఒక సందర్భంలో రాజమౌళి తనకు కూడ జూనియర్ తో ‘దానవీర శూర కర్ణ’ ను తీయాలని ఉంది అని ఓపెన్ గానే చెప్పాడు.

దీనితో ఎప్పటికైనా ‘దానవీర శూరకర్ణ’ రీమేక్ లో జూనియర్ నటిస్తాడు అని అభిమానులు ఆశిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆకలల పై ఒక కన్నడ హీరో నీళ్ళు జల్లడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

కన్నడ సినిమా రంగంలో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిర్మింపబడ్డ ‘కురుక్షేత్ర’ విడుదలకు రెడీ అవుతోంది. ఈమూవీలో కూడా మొత్తం దుర్యోధనుడు పాత్రను హీరోగా చూపించారు అని సమాచారం. ఇప్పటివరకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమాకు పెట్టని విధంగా 150 కోట్ల బడ్జెట్ ఈమూవీ పై పెట్టడంతో పాటు ఈమూవీని తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. 

ఈమూవీలో కన్నడ స్టార్ హీరో దర్శన్ దుర్యోధనుడుగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. తెలుగులో ‘అన్నమయ్యా’ ‘శ్రీరామదాసు’ ‘మంజునాద’ లాంటి సినిమాలకు స్క్రిప్ట్ అందించిన జెకే భారవి ఈసినిమాకు స్క్రిప్ట్ అందించడం విశేషం. దీనితో జూనియర్ తన కెరియర్ లో ఎప్పటికైనా చేయాలి అని కలలు కన్న ఒక అద్భుత సినిమాను చేసే అవకాశం పోగొట్టుకున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: