'ఓహ్ బేబీ' తో హిట్ కొట్టి ఆనందంలో ఉంది సమంత,  తన నటనకి ఫాన్స్ నీరాజనాలు పడుతుండడం తో ప్రస్తుతం వెకేషన్ కి వెళ్లి ఫోటోషూట్లతో తన ఆనందాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. 


సామ్ ఎన్ని విమర్శలు వచ్చినా, తనకి ఇష్టమైన పనిని మాత్రం మానదు....అవే ఫోటోషూట్లు.  తాజాగా మరోసారి అదే పని చేసింది.  ఇంస్టాగ్రాం లో ఒక ఫోటో ద్వారా తన సీక్రెట్ టాట్టూను బైట పెట్టింది.  ఈ ఫోటోకు "బెస్ట్ లైఫ్ ను చూస్తున్నాను. (ఇప్పటివరకూ దాచిపెట్టిన నా పచ్చబొట్టును ఫైనల్ గా చూపిస్తున్నా) చైతన్య అక్కినేని మై హబ్బీ మై వరల్డ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  వైట్ కలర్ టాప్.. బెల్ బాటం స్టైల్ కు దగ్గరగా ఉంటె పలాజో ప్యాంట్ ధరించి సూపర్ స్టైలిష్ గా నిలబడింది.  కుడిచేతిని పైకెత్తి తలవెనక పెట్టుకుంది.. ఎడమ చేతిని తన మొహం దగ్గరగా పెట్టుకొని ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  ఎడమ చేతిని పైకెత్తడంతో టాప్ కాస్త పైకి జరిగి తన రహస్యపు పచ్చబొట్టు కనిపిస్తోంది.  అయితే అదేంటో మాత్రం క్లియర్ గా తెలియడం లేదు.


సామ్ కు టాట్టూలు కొత్త కాదు.. మణికట్టుపై ఒకటి.. నడుముపై మరొకటి ఉంది. ఇప్పుడు కొత్త టాటూ గురించి కూడా అందరికీ చెప్పేసింది.  చైతు అని స్పెషల్ గ మెంతిఒన్ చేసినందు వాళ్ళ, ఆ టాటూ కచ్చితం గా నాగ చైతన్య పేరు అయుంటుంది అని ఇంస్టాగ్రామ్ఈ మరియు సోషల్ మీడియా లో చర్చ మొదలైంది. ఇప్పటికే వైరల్ అయినా ఆ ఫొటోలకి రకరకాల రెస్పాన్సులు వస్తున్నాయి...."స్టన్నింగ్" అని 'అదితి రావు హైదరి' ప్రశంసించగా, "ఫుల్ టాట్టూ చూపించవా సామ్".. "వైట్ డ్రెస్.. హాట్ టాట్టూ" అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు.  ఒకరు మాత్రం "ఈ ఫోటోతో నన్ను డిజప్పాయింట్ చేశావు" అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: