మన తెలుగువారికి తెలిసిన రెండు కథలు మహాభారతం, రామాయణం. భారతం పై చాలా తక్కువ సినిమాలు వచ్చాయి కానీ రామాయణం పై బోలెడు సినిమాలు వచ్చాయి. రామాయణం తెలుగువారి మనసులను దోచుకుంది. అయితే మరోసారి రామాయణం కథ మనముందుకు రానుంది. అయితే దీనికోసం ఈసారి భారీగా ప్లాన్ చేస్తున్నారు.


త్వరలోనే రామాయణం కథ అత్యంత భారీస్థాయిలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దానికి ‘రామాయణ’ అనే టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ .. మధు మంతెన .. నమిత్ మల్హోత్ర నిర్మించడానికి రెడీ అవుతున్నారు. తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషల్లో 3D వెర్షన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


‘దంగల్’ దర్శకుడు నితేశ్ తివారీ.. ‘మామ్’ దర్శకుడు రవి ఉదయవర్ ఈ సిరీస్ కి దర్శకులుగా వ్యవహరించనున్నారు. అయితే 3 భాగాలుగా తెరకెక్కనున్న ఈ ‘రామాయణ’ మొదటిభాగాన్ని 2021లో విడుదల చేయనున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇందులో ఎవరెవరు నటిస్తున్నారో సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో హిందీ, తెలుగు, తమిళ భాషలకి సంబంధించి వాళ్ళు నటించనున్నారని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: