మన నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు.  ఎక్కడైనా మన మంచితనంతో ఎంత గొప్ప పనైనా సాధిస్తారు..అదే వెదవ్వేశాలు వేస్తే తన్నులు తింటారు.  ఇప్పుడు ఇదే అమెరికాలో జరిగింది.  అందీ ఒక తెలుగు కమెడియన్ తన నీచ బుద్ది చూపించుకొని పదిమందితో తన్నులు తిన్నారు..విషయం కాస్త పోలీసుల వద్దకు పోవడంతో కాళ్ల బేరానికి రావడంతో టాపిక్ అక్కడితో ఆగిందట.  అంతే కాదు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు సమాచారం.  ఇటీవల టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ తెలుగు కమిడయన్  అమెరికాకు వెళ్లారు.


అక్కడ ఓ ఈవెంట్ లో పాల్గొనాలి...అందుకోసం కారు వస్తే  ఆ హాస్య నటుడుని సగౌరవంగా  ఎక్కించుకుని  వెళ్తున్నారు.  కారులో ఎక్కిన ఆ కమెడిన్  బుద్ది తిన్నమైనది కాదు. గతంలోనూ షూటింగ్ లోనూ , బయిట అమ్మాయి కనపడితే అంగలార్చతూ ఉంటాడు.  గతంలో కూడా పలు సందర్భాల్లో అతడి నీచ బుద్ది చూపించుకొని ఇలాంటి అవమానాలే పొందాడు.  తన ప్రక్కనే కూర్చున్న  అమ్మాయిపై చెయ్యి వేసాడు. మొదట క్యాజువల్ గా వేసాడనుకున్నా తర్వాత అసలు విషయం ఆమెకు అర్దమైంది. మొదట వారించినా..అతడి మితిమించిపోవడంతో అక్కడే కారు ఆపి చెంపలు వాయించింది..విషయం తెలుసుకున్న పక్కన ఉన్నవారు కూడా అతనిపై చేయి చేసుకున్నారట. 


అంతే కాదు ఈ విషయం కాస్త పోలీసుల వద్దకు వెళ్లడంతో వారితో కాళ్లబేరానికి వచ్చాడు. అలాగే మీడియాకు ఈ విషయం తెలియచేవద్దని బ్రతిమిలాడుతున్నాడని, తెలిసిన మీడియాను తన వార్త బయిటకు తేవద్దని కోరినట్లు సమాచారం. ఈ సంఘటనతో అతని ప్రోగ్రామ్ కూడా క్యాన్సల్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి వంకరటింకర మనసు గల వాళ్లు అమెరికాలో తెలుగు వాళ్ల పరువు తీయడం ఎంతో అవమానం అని అంటున్నారు.  ఏది ఏమైనా ఈ విషయం త్వరలో బయటకు పొక్కకుండా ఉండదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: