టాలీవుడ్ లో  తమ్మారెడ్డి భరద్వాజ అంటే  ఓ పెద్ద మనిషి.  పైగా మంచి చెడ్డలు చెప్పే అలవాటు ఉన్న ఆయన.. ఏ ఉద్దేశ్యంతో  ఓ డబ్బింగ్ సినిమా రైట్స్ కొనుక్కొని విడుదల చేస్తున్నారో గాని.. ఇప్పుడు అది ఆయనకు ఉన్న పేరు కూడా పోగెట్టేలా ఉంది.  ఇంతకీ విషయంలోకి వెళ్తే..   అమలాపాల్ ప్రస్తుతం ''ఆడై'' అనే థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.   ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. ‘ఆమె’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 



కాగా ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా  ట్రైలర్‌ లో  అమలాపాల్  మరీ  బోల్డ్‌ గా కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది.  ట్రైలర్ లో ముఖ్యంగా.. చివర్లో వచ్చే  అమలాపాల్ న్యూడ్ షాట్స్   బాగా  వైరల్ అయ్యాయి.  ఇక  ఈ సినిమాలో  కామిని అనే పాత్రలో నటిస్తున్న  అమలా పాల్, కొన్ని దారుణమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడగలిగింది అనే కోణంలో  ఈ సినిమా ఉంటుందట. ఏమైనా సినిమాలో మాత్రం న్యూడ్ షాట్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. మరి ఈ బూతు సినిమా తమ్మారెడ్డి భరద్వాజగారికి అవసరమా.  


మరింత సమాచారం తెలుసుకోండి: