యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ క్రేజీ యాక్షన్ విజువల్ ఫీస్ట్ సాహో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. రీసెంట్‌గా ప్రకటించినట్టుగానే 'సైకో సయ్యా' పాటను లిరికల్ వీడియోగా కాకుండా ఏకంగా వీడియో సాంగ్ ని రిలీజ్ చేసి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది సాహో టీమ్. ఆగడిక సైకో సయ్యా అనే శీర్షికతో సాగే ఈ పాటను తనిష్క్ బాగ్చి కంపోజ్ చేయగా కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ తో పాటు ధ్వనిభానుశాలి స్వరం అందించారు.

పబ్ బ్యాగ్డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ పాటలో శ్రద్ధా కపూర్ గ్రీన్ కాస్ట్యూమ్ లో హాట్ హాట్ గా,  ప్రభాస్ రఫ్ లుక్స్ తో బ్లాక్ జెర్కిన్ తో కిరాక్ అనిపించేలా ఉన్నారు. స్మూత్ గా అనిపించే స్టెప్స్ తో మూడ్ కు తగ్గట్టు కుదిరిన డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి.  ట్యూన్ మాత్రం పక్కా బాలీవుడ్ స్టైల్ లోనే ఉంది. పల్లవిలోని పదాలు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ చరణాలు మాత్రం సులువుగానే ఉండేలా లిరిసిస్ట్ శ్రీజో జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.

ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే హిందీలో కంపోజ్ చేసి తెలుగులో డబ్ చేసినట్టు అనిపిస్తోంది ఈ పాట. సాంగ్ విజువల్స్ తో పాటు ట్రైలర్ షాట్స్ కొన్ని ఈ సాంగ్ లో పెట్టారు. ఫైనల్ గా చెప్పాలంటే అద్భుతం, ఎక్స్ ట్రాడినరి అనే రేంజ్ లో ఈ సైకో సయ్యా పాట లేదు. కానీ ఓవరాల్ గా ఫ్యాన్స్ కోణంలో చూసుకుంటే పాస్ అయ్యేలా ఉంది. ఆగస్ట్ 15 విడుదలకు రెడీ అవుతున్న సాహో ఇక ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతోందని అర్థమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: