ప్రభాస్‌ ‘సాహో’ లోని తొలిపాట ‘సైకో సయ్యాన్‌’ అద్భుతం అంటూ ప్రభాస్ అభిమానులు బయటకు చెపుతున్నా లోలోపల వారిని ఈపాట నిరాస పరిచింది అని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చి స్వరపరిచిన ఈ పాట బీట్ బాగున్నా లిరిక్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది అని అభిమానులు మధన పడుపోతున్నారు. ఈపాటకు సంబంధించి ముందు హిందీ లిరిక్ వ్రాసి దాని తరువాత దానికి అనుగుణంగా తెలుగు పాట ట్యూన్ ను రికార్డ్ చేయడంతో ఈ గందరగోళం ఏర్పడింది. 

ప‌క్కా వెస్ట్ర‌న్ బీట్‌తో పాట‌ బాగుంది అనిపించినా ఈపాటలోని తెలుగు పదాలు ప్రభాస్ అభిమానులకే అర్ధం కావడం లేదు అని టాక్.  ముఖ్యంగా ‘సాహో’ మూవీకి లిరిక్ రైటర్ గా శ్రీజో వ్యవహరించారు. అయితే అతడు వ్రాసిన ఈపాట ట్యూన్ కు తగ్గ పాటలా లేకుండా కేవలం హిందీ పాటకు డబ్బింగ్ సాంగ్ వ్రాసినట్లుగా మారినట్లు ఉంది అని అభిమానుల అభిప్రాయం. 

దీనితో ఈమూవీలోని పాటలు అన్నీ ఇలాగే ఉంటాయా అని అభిమానులు భయపడిపోతున్నారు. వాస్తవానికి ఈసినిమాను తెలుగు హిందీ భాషలలో ఒకేసారి నిర్మిస్తున్నా ప్రభాస్ నటించిన హిందీ సినిమా డబ్బింగ్ గా తెలుగులో ‘సాహో’ మారుతుందా అన్న భయాలు ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నాయి. 

ఈపాటలో శ్రద్ధా కపూర్ డాన్స్ ఇరగదీస్తుండగా ప్రభాస్ చేత చిన్న చిన్న స్టెప్స్ వేయించడం ప్రభాస్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అని తెలుస్తోంది. దీనికితోడు ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే ‘సాహో’ మరో ‘స్పైడర్’ కాబోతోంది అంటూ జరుగుతున్న ప్రచారం ప్రభాస్ అభిమానులను మాత్రమే కాకుండా ఈమూవీ బయ్యర్లను కూడ తీవ్రంగా కలవర పెడుతున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: