బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా టైగర్ నాగేశ్వ‌రావు బ‌యోపిక్ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లె మొద‌లైంది. పాయ‌ల్ ఈ చిత్రంలో ఓ వేశ్య పాత్ర‌లో న‌టిస్తున్ప‌ప్ప‌టికీ.. కొన్ని స‌న్నివేశాల్లో పోలీస్ గెట‌ప్‌లో క‌నిపించ‌నుంది. మ‌రో విష‌య‌మేమిటంటే ఈ చిత్రంలో త‌న పాత్ర బాగా బోల్డ్‌గా ఉంటుంద‌ట‌. బోల్డ్ పాత్ర‌లు చేయ‌డంలో ఈ భామ ధిట్ట అనే చెప్పాలి. 


ఇక చిత్ర యూనిట్ స‌మాచారం ప్ర‌కారం ఇటీవ‌లే పాయ‌ల్ షూటింగ్‌లో పాల్గొని కొన్ని బోల్డ్ సీన్ల‌తో పాటు ఇంట‌ర్‌వెల్  సీక్వెన్స్‌ను పూర్తి చేసిన‌ట్లు తెలుసింది.ఈ సినిమాలో ఆమె హాట్ హాట్‌గా ద‌ర్శ‌న‌మిస్తుంద‌ట‌.  ఈ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు 1980-90 ద‌శ‌కాల్లో స్టూవ‌ర్టుపురం, గ‌జ‌దొంగ‌గా ఓ భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్నే సృష్టించారు. మ‌రి ఆర‌క‌మైన బ‌యెపిక్ అంటే అప్ప‌ట్లో తెలియ‌ని విష‌యాలు మ‌న‌కు చాలానే తెలుస్తాయ‌న‌మాట‌.


అలాగే ద‌ర్శ‌కుడు ఈ చిత్రంలో కొన్ని స‌న్నివేశాల‌ను బాగా బోల్డ్‌గా తీశార‌ని స‌మాచారం.  ఇక ఈ చిత్రానికి మాట‌లు ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అందిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో చాలా బోల్డ్  క్యారెక్ట‌ర్ చేసి ఆ చిత్రంలో కార్తికేయ‌న్ కంటే త‌నే ఎక్కువ మార్కులు కొట్టేసింది. మ‌రి ఇక ఈ చిత్రంలో అమ్మ‌డి పెర‌ఫ‌ర్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: