బుల్లితెరపై కానీ, వెండి తెరపై కాని ఒక్కసారి కనిపిస్తే చాలు జన్మ ధన్యమైనట్లే అని భావిస్తారు ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు.  అలాంటిది స్టార్ గా ఎదుగుతున్న యువనటుడు జీవితం విషాదంగా ముగిసింది. 20 ఏళ్ల వయసులోనే బుల్లితెర రారాజుగా మారిన కామెరూన్ బాయ్ సే  మృతి చెందాడు. ప్రఖ్యాత డిస్ని సంస్థలో నటిస్తూ టివి రంగంలో కామెరూన్ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 


వయస్సులో అతను మరణిస్తే వారి తల్లి తండ్రుల బాధ వర్ణనాతీతం, వారికి ఇంతకు మించిన విషాదం మరోకటి ఉండదు. ఒక వేళ ఆ యువకుడు నటుడై... స్టార్ డమ్  తెచ్చుకున్నవాడైతే ఇటు ఇంట్లో వాళ్లకు, అటు ఇండ్రస్ట్రీకి తీరని లోటుగానే చెప్పాలి. కామెరూన్ కుటుంబానికి చెందిన అధికార ప్రతినిధి అతడి మరణ వార్తని వాషింగ్టన్ పోస్ట్ సంస్థకు తెలియజేశాడు. కామెరూన్ గత కొంత కాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. అక్కడి వాళ్లను కంట తడి పెట్టించింది.


ఇంత చిన్న వయస్సులో  మృత్యువు కబళించటంతో  అంతా విషాదంలో మునిగి పోయారు. 2008 లో 9 ఏళ్ల వయస్సులో మిర్రర్స్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి నటుడిగా అడుగు పెట్టి సినిమాలు, సీరియల్స్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుని అతి చిన్నవయస్సులోనే తిరిగిరాని లోకాలకు చేరుకోవటంతో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది. ఖ్యాత డిస్ని సంస్థలో అతడు నటించడంలో మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. కామెరూన్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: