మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150తో సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అయన 151వ సినిమాగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. 

ఇక గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా సైరా టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఇక అప్పట్లో మంచి సక్సెస్ సాధించిన ఆ టీజర్ తరువాత, ఇప్పటివరకు సైరా టీమ్ నుండి మెగా ఫ్యాన్స్ కు ఎటువంటి అధికారిక పోస్టర్ కానీ లేదా ఎటువంటి అప్ డేట్ కానీ లేదు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకోవడంతో ఇకపై సినిమా ప్రమోషన్ పై గట్టిగా దృష్టి పెట్టిందట కొణిదెల ప్రొడక్షన్ టీమ్. ఇక త్వరలో రాబోయే మెగాస్టార్ పుట్టిన రోజైన ఆగష్టు 22న సైరా ట్రైలర్ ని విడుదల చేసేలా ఇప్పటినుండి అన్ని ఏర్పాట్లు ప్రారంభించినట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

ఈలోపు సినిమాకు సంబంధించి ఒక ప్రకటన కూడా వారి నుండి రానున్నట్లు సమాచారం. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మెగాస్టార్ బర్త్ డే రోజన అయన ఫ్యాన్స్ కు పెద్ద పండుగే అని చెప్పవచ్చు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: