తెలుగు తెరపై హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తమన్నా తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం తప్ప ఏ సినిమా పెద్దగా పేరు తీసుకు రాలేకపోయింది. దాంతో హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్ పై ఫోకస్ చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించింది. బాహబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించినా తమన్నాకు పెద్దగా కలిసి రాలేదు.
తెలుగు సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి జంప్ అయ్యింది. అక్కడ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకులు, నటుడు ప్రభుదేవతో రెండు సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇటీవల ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ ను రెట్టింపు ధరకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది.
సముద్రతీరాన ఉన్న ఆ ఇంటిని దాదాపు రూ.16 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తమన్నా కొన్నట్లు తెలిసింది. అయితే అక్కడ ఉన్న రేటుకన్నా రెట్టింపు రేటు చెల్లించి ఆ ఇల్లు సొంతం చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే ప్రశ్న తమన్నాను తన హిందీ టీచర్ ఇల్లు కొన్నావా..? అని మెసేజ్ చేశారని.. రెట్టింపు ధరకి నేనెందుకు కొంటానని టీచర్ కి చెప్పినట్లు వెల్లడించింది.
కొన్ని రోజుల నుంచి ఇదే ప్రశ్నలు ప్రతి ఒక్కరూ అడగడంతో బాబోయ్ నేను ఇల్లు కొన్నాను..కానీ రెట్టింపు మాత్రం ఖర్చుచేయలేదు అని చెప్పింది. ఇంటి పనులు పూర్తయిన తరువాత తన తల్లితండ్రులతో కలిసి అక్కడకి షిఫ్ట్ అవుతానని చెప్పింది. తనకు సింపుల్ గా జీవించడమే ఇష్టమని వెల్లడించింది.