నిప్పు.. తెలిసి పట్టుకున్నా.. తెలియక పట్టుకున్నా కాలడం ఖాయం.. చట్టం కూడా అలాంటిదే.. తప్పు తెలిసి చేసినా.. తెలియక చేసినా శిక్ష అనుభవించాల్సిరావడం ఖాయం.. పాపం.. ఉత్తర కొరియాకు చెందిన హీరోయిన్ లీ యోల్.. పరిస్థితి అలాగే తయారైంది.


ఆమె ఓ రియార్టీ కోసం సముద్రంలో దిగి.. ఓ సముద్ర జీవిని పట్టుకుంది. అంతేకాదు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆ సముద్ర జీవి అంతరించి పోతున్న జాబితాలో ఉన్నదట.


అలాంటి జీవులను పట్టుకోవడం నేరమట. పాపం.. ఆ విషయం ఆ నటికి తెలియదు. కానీ.. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో చూసిన అధికారులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ నేరానికి ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడుతుందని అధికారులు చెబుతున్నారు.


తాను తెలియక ఆ తప్పు చేశానని పాపం లీ ఎంత మొత్తుకుంటున్నా.. అధికారులు మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారట. జైలుశిక్ష తో పాటు కొంత జరిమానా కూడా విధించారట. దీంతో ఆ నటి అజ్ఞాతంలోకి వెళ్లింది ఆమె కోసం అధికారులు వెదుకుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: