యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించబోయే సినిమా పూజ కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది బాలకృష్ణతో రవికుమార్, జైసింహా వంటి హిట్ సినిమాని అందించడం జరిగింది. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలోనే రవికుమార్ మరొక కథ విషయం బాలయ్యకు చెప్పడం, అది ఆయనకు నచ్చడంతో ఆ సినిమాను పట్టాలెక్కించారట. 

అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కంటే ముందే బోయపాటి తన వద్ద ఉన్న ఒక కథను బాలయ్యకు వినిపించారని, అయితే ఆ కథలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేసుకుని పూర్తి స్క్రిప్ట్ తో వస్తే, కొద్దిరోజుల తరువాత సినిమా చేద్దాం అని అప్పట్లో బాలయ్య అన్నారట. ఇక ఆ సినిమాపై నేడు ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, బోయపాటి బాలయ్య కోసం సిద్ధం చేసిన కథలో కొన్ని మార్పులు చేసి మూడు రోజుల క్రితం ఆయనకు వినిపించడం జరిగిందని, 

అయితే దానికి బాలయ్య ఏ మాత్రం సంతృప్తి చెందలేదని, కాబట్టి ఆ కథను మరింత జాగ్రత్తగా మార్చి తాయారు చేయడానికి మరికొన్నాళ్లు టైం పట్టవచ్చు కనుక, ఇక ఇప్పట్లో బాలయ్యతో బోయపాటి సినిమా లేనట్లే అని, ఈ విధంగా చూసుకుంటే బాలయ్య బోయపాటికి హ్యాండ్ ఇచ్చినట్లే అని అంటున్నారు. అయితే ఇది కేవలం పుకారు మాత్రమే అని, ఎందుకంటే ఈ విషయమై బాలయ్య నుండి కానీ, బోయపాటి నుండి కానీ ఒక ప్రకటన వస్తేనే కానీ నమ్మలేం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: