సినిమా నటులంటే.. సమాజంలో ఓ మోడల్.. వారు చేసే పనులంటే చాలామందికి క్రేజ్.. ఇక అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు.. వారి అడుగుజాడల్లో నడుస్తుంటారు. అందుకే వారు చేసే సామాజిక కార్యక్రమాలు మిగిలిన వారికీ స్ఫూర్తినిస్తాయి.


యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ అలాంటి పనే చేస్తున్నాడు. మున్నిగూడలోని అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్నాడు. రెండేళ్లుగా దాదాపు 100 మందికి‌పైగా పిల్లలకు విద్య, పౌష్టికాహార సంబంధమైన అవసరాల కోసం సహాయం చేస్తున్నాడు.


పేద, అనాథ పిల్లలకు విద్య, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పని చేస్తున్న ‘థింక్‌ పీస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో సాయి ధరమ్ తేజ్ ఈ సమాజ సేవ చేస్తున్నారు. ఈ సంస్థ విరాళాలు సేకరించడం ద్వారా వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు సహాయం చేస్తుంటుంది.


సాయి ధరమ్ తేజ్ ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఆ చిన్నారుల సంతోషం నాకు సంతృప్తిని ఇచ్చిందంటున్నాడు. మీరు కూడా విరాళాలు అందించాలని కోరుతున్నానని అభిమానులకు పిలుపు ఇస్తున్నాడు. శభాష్ సాయి ధరమ్ తేజ్..


మరింత సమాచారం తెలుసుకోండి: