క్యాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్.. ఇలా పేర్లు ఎన్ని ఉన్నా.. విషయం ఒక్కటే.. సినీ, గ్లామర్ రంగాల్లో అమ్మాయిలకు పడుకుంటేనే అవకాశాలు వస్తాయన్నది ఈ క్యాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ కల్చర్ పరమార్థం. కానీ ఇప్పుడు ఈ దరిత్రం బిగ్ బాస్ షో కు కూడా పాకినట్టు ఆరోపణలు వస్తున్నాయి.


ఇంతకీ ఈ ఆరోపణలు చేస్తున్న అమ్మాయి.. ఏకంగా ఓ న్యూస్ యాంకర్ కావడం విచిత్రం.. ఇలాంటి కల్చర్ పై ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన ఆమెనే నేరుగా మా బాస్ దగ్గర పడుకుంటారా అని అర్థం వచ్చేలా అడిగారని ఆమె ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

అసలు ఏం జరిగిందో.. ఆమె మాటల్లోనే..

రవికాంత్ అనే కోఆర్డినేటర్ ఫోన్ చేసి మిమ్మల్ని సెలక్ట్ చేశాం అన్నాడు. , సెలక్షన్ టైములో తరచూ మీటింగులు ఉంటాయన్నాడు. తరువాత ఓ హోటల్‌కు రఘు ప్లస్ హెచ్ఆర్ వ్యక్తి వచ్చారు 10 నుంచి 15 పేజీలపై అగ్రిమెంట్ పై సంతకాలు చేశాను..


శ్యాం అని ఇంకో కొత్త కేరక్టర్ ఎంటరైంది… తనూ ఓ కోఆర్డినేటరేనట…మీటింగు అన్నాడు, వెళ్తే మీరు మా బాసును ఎలా ఇంప్రెస్ చేస్తారు అనడిగాడు.. మీరు మా బాసును ముందుగా సాటిస్‌ఫై చేయాలి కదా అన్నాడు… అంటే..? కమిట్‌మెంటా..? అని నేరుగా మొహం మీదే అడిగాను… తరువాత్తరువాత నా కాల్స్ కట్… అంటే ఒప్పందం గిప్పందం కేన్సిల్ అన్నట్టేనా..? చివరకు బిగ్‌బాస్ కూడా ఇదే టైపా..? అంటూ శ్వేతారెడ్డి బిగ్ బాస్ షో గుట్టు బయటపెట్టింది. మరి ఇందులో నిజమెంతో బిగ్ బాస్ టీమే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: