2019 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యానియాను లెక్క చేయకుండా విడుదల అవుతున్న ‘దొరసాని’ మూవీని ఆనంద్ దేవరకొండ చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాత్మికతో తన రిలేషన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

ఈమూవీ కథ రీత్యా తనకు శివాత్మికకు పెద్ద చనువు ఉండదని అందువల్ల నటించే సందర్భంలో సహజత్వం కోసం తాను శివాత్మికతో ఎటువంటి చనువును పెంచుకోలేదని కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈమూవీ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు కూడ తాను వేరేగా శివాత్మిక వేరేగా ఉన్న నేపధ్యంలో మొదట్లో తమ మధ్య ఎటువంటి సాన్నిహిత్యం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. 

అయితే ఈమూవీ షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి తాను శివాత్మికకు చాల మంచి స్నేహితుడుగా మారిపోయాను అంటూ తమ ఇద్దరి సాన్నిహిత్యం పై ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. ఇదే సందర్భంలో ఆనంద్ దేవరకొండ వేరే ట్విస్ట్ ఇస్తూ తన పై అదేవిధంగా శివాత్మిక పై టెస్ట్ సీన్స్ తీస్తున్నప్పుడు తామిద్దరం సెలెబ్రెటీల కుటుంబం నుండి వచ్చాము అన్న ఫీలింగ్ లేకుండా తమను అతి సాధారణంగా అందరితో సమానంగా ఈమూవీ యూనిట్ ట్రీట్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

ఈసినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అయినప్పటికీ నిజ జీవితానికి చాల దగ్గరగా ఉండే ప్రేమ కథ అని చెపుతూ ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ లేకపోయినా దానికి మించిన ఉదాత్తమైన ప్రేమ సీన్స్ ఉంటాయి అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుత తరం ప్రేక్షకులు చాల ఘాఢమైన ప్రేమ సన్నివేశాలు చూడటానికి అలవాటు పడిన నేపధ్యంలో ఇలాంటి పాత జమిందారి వ్యవస్థకు సబంధించిన ప్రేమ కథను తిరిగి ఈనాటి తరం ప్రేక్షకులకు చూపెడితే ఎంత వరకు కనెక్ట్ అవుతారు అన్నది సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: