సమంత హీరోయిన్ గా చేసిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్నది.  దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  ఇందులో సమంత తో పాటు నాగశౌర్య కూడా నటించాడు. నాగశౌర్యకు లక్ష్మితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదట.  


మురారి సినిమా తరువాత ఆమెతో ఎప్పటికైనా కలిసి పని చేయాలని అనుకున్నాడు.  ఆ అవకాశం ఓ బేబీ రూపంలో ఇలా వచ్చింది.  ఓ బేబీలో ఓ సీన్ ఉన్నది.  అందులో సమంతతో కలిసి కూర్చొని మందు కొడుతున్న సమయంలో సమంత చెప్పిన మాటలు వింటూ సడెన్ గా ఆమెపై నోట్లో ఉన్నవి ఉమ్మేయ్యాలి.  


షాట్ స్టార్ట్ అయ్యింది.. ఫస్ట్ షాట్ లోనే సీన్ ఒకే అయ్యింది.  కానీ, పర్ఫెక్ట్ కోసం మరో టెక్ చేద్దామని చెప్పిందట సమంత.  ఒక సీన్ బాగా రావడానికి సమంత ఎంతగా కష్టపడుతుందో ఇదే నిదర్శనం అంటున్నాడు నాగశౌర్య.  సమంతతో పటు నాగశౌర్యకు కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాతో.  


ప్రస్తుతం ఈ యువహీరో అశ్వద్ధామ, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలు చేస్తున్నాడు.  ఈ రెండు సినిమాపై బోలెడు అసలు పెట్టుకున్నాడు.  అశ్వద్ధామ షూటింగ్ సమయమూ 14 నిమిషాల సీన్ డూప్ లేకుండా చేసే సమయంలో కాలికి ఫ్యాక్చర్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: