ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో.. హీరోయిన్ గా చేసిన అనుష్కకు కూడా అంతే పేరు వచ్చింది.  సోలో హీరోయిన్ గా అరుంధతి, భాగమతి సినిమాలే ఒక ఉదాహరణ.  


ఇప్పటి వరకు సౌత్ వరకే పరిమితం అయ్యిన అనుష్క, బాహుబలితో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.  ప్రస్తుతం అనుష్క సైలెన్స్ పేరిట ఆమె చేస్తోన్న ఈ థ్రిల్లర్‌ అన్ని భాషల వారికి కనక్ట్‌ అయ్యేలా వుంటుందట. బాహుబలి రాకముందే తెలుగు, తమిళంలో అనుష్కకి గ్యారెంటీ మార్కెట్‌ వుంది. బాహుబలి వల్ల హిందీలో కూడా పాపులర్‌ అయింది కనుక ఈ చిత్రం అక్కడా కన్నేసింది. 


ఈ చిత్రంలో నటించడం కోసం కష్టపడి సహజ పద్ధతులలో బరువు తగ్గిన అనుష్క అహర్నిశలు శ్రమిస్తూ షూటింగ్‌ చేస్తోంది. ఇటీవలే మొదలయిన ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో మంచి ముహూర్తం చూసుకుని ఈ చిత్రాన్ని అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. 


ఈ సినిమా తరువాత ఏం చేయబోతున్నది అన్నది ఇంకా స్పష్టత లేదు.  సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటిస్తున్న ఈ హీరోయిన్ సైలెన్స్ తరువాత హీరోలతో కలిసి చేస్తుందా లేదంటే.. సోలో హీరోయిన్ గా చేసేందుకు సిద్ధం అవుతుందా అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: