స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3వ సీజన్ కు రెడీ అవుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఈ నెల 21 నుండి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈసారి కంటెస్టంట్స్ కూడా స్టార్ సెలబ్రిటీస్ అని తెలుస్తుంది.


ఇప్పటికే కంటెస్టంట్స్ లిస్ట్ ఇది అంటూ 14 మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే వాటిలో లేని ఓ హీరోయిన్ ఈసారి బిగ్ బాస్ కంటెస్టంట్ గా వస్తుందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 3లో స్టార్ కంటెస్టంట్ గా కుమారి హెబ్భా పటేల్ వస్తుందని తెలుస్తుంది. కుమారి 21ఎఫ్ సినిమాతో యూత్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించిన హెబ్భా పటేల్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా సరైన సినిమాలను ఎంపిక చేసుకోక కెరియర్ లో వెనుక పడ్డది.


ప్రస్తుతం ప్రిన్స్ తో ఓ సినిమా చేస్తున్న హెబ్భా పటేల్ బిగ్ బాస్ షోలో పాటిస్పేట్ చేస్తుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హెబ్భా పటేల్ స్పెషల్ ఎట్రాక్షన్ ఇవ్వనుందట. కచ్చితంగా బిగ్ బాస్ లో హెబ్భా పటేల్ అంటే షోకి హైప్ వచ్చినట్టే. అంతేకాదు హౌజ్ లో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే కుమారిని లైన్ లో పెట్టేందుకు ట్రై చేస్తారు.


హెబ్భా పటేల్ బిగ్ బాస్ ఎంట్రీ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది త్వరలో తెలుస్తుంది. షో రూల్స్ ప్రకారం కంటెస్టంట్స్ ఎవరన్నది షో మొదలైన రోజే రివీల్ చేస్తారు. మరి హెబ్భా పటేల్ ముందే కంటెస్టంట్ గా వస్తుందా లేక వైల్డ్ కార్డ్ గా సర్ ప్రైజ్ ఇస్తుందా చూడాలి. ఈసారి హౌజ్ మెట్స్ లో స్టార్ యాంకర్స్, సెలబ్రిటీస్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: