‘జెర్సీ’ సినిమా తరువాత నాని చాల అంచనాలు పెట్టుకుని విడుదల చేస్తున్న మూవీ ‘గ్యాంగ్ లీడర్’. ఈమూవీకి విక్రమ్ కుమార్ దర్శకుడుగా వ్యవహరిస్తూ ఈమూవీని చాల విభిన్నంగా తీసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఆగష్టు 29న విడుదల కాబోతున్న ఈమూవీకి ఏకంగా చిరంజీవి పుట్టినరోజు సమస్యగా మారడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో ఒక చిన్న సినిమా నిర్మాణం జరుపుకోవడంతో ఈ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ కోసం పట్టుపట్టిన నాని పట్టుదల పట్టడంతో ఈమూవీ చివరకు ‘నాని గ్యాంగ్ లీడర్’ గా మారింది. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోయింది. 

అయితే చిన్న సినిమాగా ఇప్పటికే రెడీ అయిన ఈ ఒరిజనల్ ‘గ్యాంగ్ లీడర్’ ను చిరంజీవి వీరాభిమాని అయిన ఆమూవీ నిర్మాత చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగష్టు 22న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీనితో కేవలం వారంరోజుల గ్యాప్ తో తెలుగు ప్రేక్షకులు రెండు ‘గ్యాంగ్ లీడర్’ మూవీలను చూడవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. 

ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్ లోని సన్నివేశాలు లేటెస్ట్ గా విడుదల అయిన 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీలోని సన్నివేశాలకు పోలి ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ‘నాని గ్యాంగ్ లీడర్’ పై మరో ‘గ్యాంగ్ లీడర్’ పోటీ పడటం ఎలాంటి కన్ఫ్యూజన్ కు దారి తీస్తుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా చిరంజీవి పుట్టినరోజు నానీకి సమస్యగా మారింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: