టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.  ఆయన నటించిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో డ్యాన్సులు, ఫైట్స్ తో అదరగొడుతుంటాడు. నివాస్ దర్శకత్వంలో దేశభక్తిపై వచ్చిన మూవీ ‘నా పేరు సూర్య’.  ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు..కానీ అల్లు అర్జున్ నటనకు జనాలు ఫిదా అయ్యారు.  ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్ని ప్రముఖ దర్శకులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ వేగంగా  జరుగుతున్నది. ఇప్పటి వరకు ఈ మూవీ ఫస్ట్ లుక్..ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.  త్వరలో ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.  వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట.  ఈ మూవీ తర్వాత బన్నీ వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉందట.  ఈ నేపథ్యంలోనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎన్నో చర్చలు నడిచాయి.  ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఇందులో బన్నీకి జోడిగా జైలవకుశ సినిమాలో హీరోయిన్ గా చేసిన రాశిఖన్నాను తీసుకుంటున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో రాశీఖన్నాకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వెంకిమామ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: